సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ చైర్మన్ వైవీ

లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 400 మంది ప్రకాశం జిల్లా కార్మికులను రాష్ట్రానికి తరలించడంలో సీఎం జగన్ ఎంతో కృషి చేశారంటూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లాకు చెందిన వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకువచ్చే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంతో వ్యవహరించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల నిధులను విడుదల చేసిందని వైవీ తెలిపారు.

YV Subba Reddy
Jagan
Migrants
Prakasam District
Maharashtra
Andhra Pradesh
Lockdown
Corona Virus

More Telugu News