COVID-19: భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 4,970 కొత్త కేసులు

COVID19 cases cross 1 lakh mark with a singleday jump of 4970 cases
  • 24 గంటల్లో భారత్‌లో 134 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 3,163
  • కోలుకున్న వారు 39,173 మంది  
భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా రోజుకి 4,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 4,970 మందికి కొత్తగా కరోనా సోకింది.

గత 24 గంటల్లో భారత్‌లో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,163కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,01,139కి చేరింది. మరోపక్క, ఇప్పటి వరకు కరోనా నుంచి 39,173 మంది కోలుకున్నారు.
COVID-19
Corona Virus
India

More Telugu News