Vellampalli Srinivasa Rao: లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో.. ఏపీలో ఆలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ

AP Minister Vellampalli says no entry for devotees in temples across state
షార్ట్స్‌లో చూడండి
కేంద్రం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఏపీలోనూ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో మే 31 వరకు రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ భక్తులను అనుమతించబోమని, ఏపీలోని అన్ని ఆలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి తాము ఇదే విధానం పాటిస్తున్నామని, ఇప్పుడది కొనసాగిస్తున్నామని తెలిపారు. కాగా, ఆర్జిత సేవల కోసం ఆన్ లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని, ఈ మేరకు భక్తులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి వివరించారు. అటు, అన్ని దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.
Go Back to Shorts
Vellampalli Srinivasa Rao
Andhra Pradesh
Temples
Devotees
Lockdown
Corona Virus

More Telugu News