అబుదాబిలోని ఇండియన్లకు సల్మాన్ ఖాన్ సూచనలు!
- కరోనాపై పోరులో హీరోలుగా నిలవాలి
- ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలి
- ప్రజలు సర్కారు మార్గదర్శకాలను పాటించాలి
- ఇళ్ల నుంచి బయటికి రాకూడదు
ప్రజలు సర్కారు మార్గదర్శకాలను పాటించాలని, అత్యవసర వస్తువులకు తప్ప, ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఆయన కోరారు. ఒక వేళ ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్-19 కట్టడి చర్యలను పాటించాలని, తమ కుటుంబాల రక్షణలో తామే హీరోలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యూఏఈలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు.