దేశంలో ఒక్కరోజులో 5 వేలు దాటిన కేసులు !

  • గడచిన 24 గంటల్లో 5,242 కరోనా పాజిటివ్ కేసులు 
  • ఇప్పటికే 96,169 మందికి వ్యాధి
  • నేటి సాయంత్రానికి లక్ష మార్క్ దాటే అవకాశం
ఇండియాలో గడచిన 24 గంటల్లో 5,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి కాగా, ఆదివారం నాడు 157 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా గణాంకాలను కలుపుకుని ఇంతవరకూ 96,169 మందికి వ్యాధి సోకినట్టు కాగా, ఇండియాలో నేటితో కరోనా కేసులు లక్షను దాటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకూ 36,824 మంది కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 56,316 మంది చికిత్సను పొందుతున్నారు. మొత్తం 3,029 మంది మరణించారు.

Corona Virus
India
One Lakh Mark
New Cases

More Telugu News