Canada: కరోనా యోధులకు వందనాలు అర్పిస్తూ... కుప్పకూలిన కెనడా యుద్ధ విమానం!

Canada Aerobatics Team Flight Crash
  • విమాన విన్యాసాలకు బయలుదేరిన స్నోబర్డ్ టీమ్
  • అదుపు తప్పి కూలిపోయిన విమానం
  • ప్యారాచూట్ సాయంతో తప్పించుకున్న పైలట్
కరోనా వైరస్ పై పోరాడుతున్న యోధులకు అభినందనలు తెలిపేందుకు విమాన విన్యాసాలు చేస్తున్న వేళ, కెనడాకు చెందిన ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. బ్రిటీష్ కొలంబియాపై విన్యాసాలు చేసేందుకు 'స్నోబర్డ్స్' టీమ్ కు చెందిన ఏరోబెటిక్స్ టీమ్ బయలుదేరింది. కామ్ లూప్స్ విమానాశ్రయం నుంచి రెండు విమానాలు టేకాఫ్ కాగా, కాసేపటికే ఓ విమానం అదుపుతప్పి, ఓ ఇంటి ముందు కూలిందని స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించామని సంబంధిత ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి అడ్రియన్ డిక్స్ వెల్లడించారు. విమానం కూలిన ఘటనను రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తావిస్తూ, ఇదో దురదృష్టకరమైన ఘటనని అభివర్ణించింది. విమానం అదుపు తప్పగానే, అందులోని పైలట్ ప్యారాచూట్ సాయంతో కిందకు దూకేశాడని, ఆ ఇంటి పైకప్పుపై అతను ల్యాండ్ కావడంతో, వెన్నెముక, మెడకు గాయాలు అయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Canada
Snow Birds
Aerobetic Team
Crash

More Telugu News