Corona Virus: భారత్‌లో తీవ్రతరమైన కరోనా.. చైనాను దాటేసిన కేసుల సంఖ్య

Spike of 3970 COVID19 cases  103 deaths in India in the last 24 hours
  • చైనాలో ఇప్పటి వరకు మొత్తం 82,940 కేసులు
  • భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 85,940
  • గత 24 గంటల్లో దేశంలో 3,970 మందికి కొత్తగా కరోనా  
  • మృతుల సంఖ్య మొత్తం 2,752
భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటి వరకు మొత్తం 82,940 కేసులు నమోదు కాగా భారత్‌లో అంతకుమించి కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 85,940కి చేరింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 3,970 మందికి కొత్తగా కరోనా సోకింది.

గత 24 గంటల్లో భారత్‌లో 103 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,752కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 30,153 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,035 మంది చికిత్స పొందుతున్నారు.  
Corona Virus
India
China

More Telugu News