Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Rakul says she is fond of food
  • రకుల్ కి ఇష్టమైన రుచులు 
  • సంక్రాంతికి వెళ్లిన రజనీ చిత్రం
  • సాహసం చేస్తున్న సూర్య
*  తాను భోజన ప్రియురాలినని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'చిన్నప్పటి నుంచీ మనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల వెరైటీ రుచుల్ని ఆస్వాదిస్తుంటాను. అందుకే, ఎప్పటికైనా ప్రపంచ యాత్ర చేయాలనీ, వివిధ దేశాల రుచులను టేస్ట్ చేయాలనీ ఆశగా వుంది' అని చెప్పింది రకుల్.
*  సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ అరవై శాతం వరకు జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతోంది. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయించారట. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా, ఖుష్బూ, మీనా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
*  ప్రముఖ నటి, సూర్య భార్య జ్యోతిక నటించిన 'పొన్నగల్ వందాల్' చిత్రాన్ని డిజిటల్ ఫార్మాట్ లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ లో వీక్షణకు అందుబాటులో వుంటుంది. థియేటర్ల యజమానులు ఎంతగా బెదిరించినప్పటికీ, ఈ చిత్రాన్ని 'ఓటీటీ'లో విడుదల చేస్తూ సూర్య పెద్ద సాహసం చేస్తున్నాడు.
Rakul Preet Singh
Rajanikanth
Shiva
Surya
Jyotika

More Telugu News