యూపీలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీల దుర్మరణం
- రాజస్థాన్ నుంచి వలస కూలీలతో వస్తున్న ట్రక్కు
- ఔరాయా జాతీయ రహదారిపై ఢీకొట్టిన మరో ట్రక్కు
- బాధితుల్లో బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కూలీలు
ప్రమాదంలో మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలామంది బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నట్టు ఔరాయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.