40 కొత్త కేసులు, 13 మంది డిశ్చార్జి.. తెలంగాణలో మరింత వ్యాపిస్తున్న కరోనా
- జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- నేడు 33 మందికి కరోనా నిర్ధారణ
- మరో ఏడుగురు వలస కార్మికులకు వైరస్
ఇక, నేడు 13 మంది డిశ్చార్జి అయ్యారు. దాంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 959కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1454 కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 461 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు విడిచారు.