Nara Lokesh: అన్నం పెట్టినందుకు కేసులు పెడతారా? సిగ్గుగా లేదా జగన్ గారూ?: నారా లోకేశ్

Nara Lokesh fires on Jagan
  • పేదవాడికి సాయం చేస్తుంటే అడ్డుపడుతున్నారు
  • వైసీపీ నేతలు కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు
  • కరోనా సమయంలో కుళ్లు రాజకీయం మంచిది కాదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు అండగా నిలబడుతున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

'పేదవాడికి ముద్ద అన్నం పెట్టినందుకు టీడీపీ నాయకులపై కేసులు పెడతారా?  సిగ్గుగా లేదా జగన్ గారూ. పేదవాడికి సహాయం చేస్తాం అంటే అడ్డుపడే దౌర్భాగ్య ప్రభుత్వం దేశంలో ఒక్క వైకాపా ప్రభుత్వం మాత్రమే. వైకాపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా స్వైరవిహారం చేస్తూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు. టీడీపీ నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సహాయం చేస్తున్నా అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

జగన్ గారికి అంత అభద్రతా భావం ఎందుకు? కరోనా సమయంలో కుళ్లు రాజకీయం మంచిది కాదు. పేద వాడికి అందే సహాయాన్ని అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్ గారు... చేసిన తప్పు సరిదిద్దుకోండి' అంటూ విమర్శలు గుప్పించారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News