Varla Ramaiah: ముఖ్యమంత్రి గారు! చర్చ నుండి పారిపోయిన దేవులపల్లి అమర్ ని ఎందుకు తొలగించరు?: వర్ల రామయ్య

TDP Leader Varla Ramaiah Statement
  • పనితీరు సరిగా లేదని ‘పోలవరం’ సాంకేతిక సలహాదారు సాహుని తొలగించారు
  • ఓ చర్చ లో ఏపీ ప్రభుత్వ సలహాదారు అమర్ ఓడిపోయారు
  • మరి, ఆయన్న పదవి నుంచి తొలగించరే?
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య మరోమారు విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక సలహాదారు సాహు పనితీరు సరిగా లేదని ఆయన్ని ముఖ్యమంత్రి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు.

మరి, ఓ టీవీ ఛానెల్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఓ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక చర్చ నుండి పారిపోయిన దేవులపల్లి అమర్ ను ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి  తొలగించరే? ఇదేమి నీతి? అని జగన్ ని ప్రశ్నించారు. కాగా, ఏపీ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాలు, జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ వ్యవహరిస్తున్నారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
Devulapalli Amar

More Telugu News