Chandrababu: ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలడో కాటన్ మహాశయుడు నిరూపించాడు: చంద్రబాబు

Chandrababu paid tribute to Sir Arthur Cotton
  • ఇవాళ కాటన్ జయంతి
  • ట్విట్టర్ ద్వారా నివాళులర్పించిన చంద్రబాబు
  • కాటన్ స్ఫూర్తితోనే పోలవరం పూర్తికి సంకల్పించామని వెల్లడి

ధవళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో స్పందించారు. కాటన్ జయంతి సందర్భంగా ఆ నిస్వార్థ ప్రజాసేవకుని స్మృతికి నివాళి అర్పిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహాశయుడు రుజువు చేశాడని కొనియాడారు.

సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం లేని రోజుల్లోనే ఆయన రెండు జిల్లాల పరిధిలో ఆనకట్ట, కాలువల వ్యవస్థను కేవలం 5 సంవత్సరాల్లో పూర్తి చేశాడని, ఆయన సంకల్పం మాటలకు అందనిదని కీర్తించారు. నీటి లభ్యతతో ప్రజల తలరాతను మార్చవచ్చని నిరూపించిన కాటన్ మహానుభావుని స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంకల్పించిన టీడీపీ, 70 శాతం పనులు పూర్తిచేసిందని చంద్రబాబు వెల్లడించారు. అటువంటి ప్రాజెక్టు ఇవాళ పడకేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News