3700 మంది ఉద్యోగులను తొలగించిన ఉబెర్
- మూడు నిమిషాలపాటు సాగిన కాల్
- సంస్థలో ఇదే చివరి రోజన్న సంస్థ కస్టమర్ సర్వీస్ హెడ్
- ముందస్తు నోటీసు లేకుండా ఇదేంటంటూ మండిపాటు
కేవలం మూడు నిమిషాలపాటు సాగిన ఈ కాల్ ద్వారా తమ ఉద్యోగుల్లో 14 శాతం మందిని తొలగించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ముందస్తు నోటీసు లేకుండా, అందరికీ ఒకేసారి కాల్ చేసి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, కరోనా మహమ్మారి ప్రభావం ఉబెర్‌పై తీవ్రంగా పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఉబెర్ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది.