Koushal: పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా 'బిగ్ బాస్ 2' విజేత కౌశల్

'బిగ్ బాస్' సీజన్ 2  రియాలిటీ షో ద్వారా కౌశల్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సీజన్లో విజేతగా నిలిచిన తరువాత ఆయన మరింత పాప్యులర్ అయ్యాడు. కౌశల్ కి వచ్చిన క్రేజ్ చూసిన వాళ్లంతా ఆయనకి వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తాయని భావించారు. అయితే కౌశల్ గానీ .. ఆయన అభిమానులుగాని ఆశించినట్టుగా అవకాశాలు రాలేదు. ఒకటి రెండు ప్రాజెక్టులలో ఆయన పేరు వినిపించిందిగానీ, ఆ తరువాత ఎక్కడా ఆ ఊసే లేదు.

అయితే తాజాగా కౌశల్ కి ఒక అవకాశం లభించినట్టు తెలుస్తోంది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం కౌశల్ ను తీసుకున్నారట. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందనీ, తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని కౌశల్ భావిస్తున్నాడు. ఈ పాత్రతో కౌశల్ తన సత్తా చాటుకుంటాడేమో చూడాలి.
Koushal
Actor
Tollywood

More Telugu News