రాజమౌళిగారు అవకాశం ఇవ్వకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది: 'కాలకేయ' ప్రభాకర్
- మాది మహబూబ్ నగర్ జిల్లా
- జాబ్ ఇప్పిస్తానని ఒక వ్యక్తి మోసం చేశాడు
- 'మర్యాద రామన్న' మంచి పేరు తెచ్చిందన్న ప్రభాకర్
ఒకసారి 'అతిథి' షూటింగు చూడటానికి వెళితే, ఆ దర్శకుడు నన్ను చూసి చిన్నవేషం ఒకటి ఇచ్చాడు. అప్పటి నుంచి దృష్టి సినిమాల వైపుకు వెళ్లింది. రాజమౌళి గారు 'మర్యాద రామన్న' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే , ఆయనే సొంత ఖర్చుతో శిక్షణ ఇప్పించారు. 'మర్యాద రామన్న' సినిమా నాకు గుర్తింపు తీసుకు రావడమే కాదు, నా అప్పులన్నీ తీర్చేసింది. ఆ తరువాత చేసిన 'కాలకేయ' పాత్ర నుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు. రాజమౌళి గారు నన్ను గుర్తించి అవకాశం ఇవ్వకపోతే, నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది" అని చెప్పుకొచ్చారు.