Bihar: బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో మద్యం సీసాల తరలింపు.. పట్టుకున్న పోలీసులు

Liquor bottles recovered from Buxar MLA car
  • బీహార్‌లో అమలులో మద్య నిషేధం 
  • నలుగురు నిందితుల అరెస్ట్
  • అంతా కుట్ర అంటున్న ఎమ్మెల్యే
మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో ఎమ్మెల్యే కారులో మద్యం తరలిస్తూ కొందరు పోలీసులకు చిక్కారు. బుక్సర్ సదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీ కారులో కొందరు మద్యం సీసాలు తరలిస్తుండగా సిమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడిచేసి పట్టుకున్నట్టు బుక్సర్ జిల్లా ఎస్పీ ఉపేంద్రనాథ్ శర్మ తెలిపారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు మద్యం తరలిస్తున్న కారు ఎమ్మెల్యే పేరున రిజిస్టర్ అయినట్టు ఎస్పీ పేర్కొన్నారు. తన కారులో మద్యం బాటిళ్లు లభించడంపై ఎమ్మెల్యే తివారీ స్పందించారు. తనను అప్రదిష్ట పాలు చేసేందుకు ఎవరో పథకం ప్రకారం తన కారులో మద్యం సీసాలు పెట్టి ఉంటారని ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bihar
Liquor bottles
Buxar MLA

More Telugu News