Nikhil: డాక్టర్ పల్లవితో ముగిసిన సినీ హీరో నిఖిల్ వివాహం... చిత్రాలివిగో!

Hero Nikhil Tie the Knot to Pallavi
  • ఈ ఉదయం 6.31కి ముహూర్తం
  • శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి వేడుక
  • అతి కొద్దిమంది మాత్రమే హాజరు
టాలీవుడ్ హీరో నిఖిల్, డాక్టర్ పల్లవీ వర్మల వివాహం ఈ ఉదయం 6.31 గంటలకు శాస్త్రోక్తంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వీరి వివాహం జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు, కరోనా కారణంగా కొద్ది మంది బంధువులు, మిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

తొలుత వీరిద్దరి ఎంగేజ్ మెంట్ తరువాత తొలుత ఏప్రిల్ 16న వివాహం జరపాలని భావించారు. ఈలోగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో పెళ్లిని వాయిదా వేశారు. అయితే, ఈ నెలాఖరు తరువాత మంచి ముహూర్తాలు లేకపోవడం, వధూవరుల జాతకాల రీత్యా గురువారం మంచి ముహూర్తం ఉందని వేద పండితులు నిర్ణయించడంలో పెళ్లి జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. కాగా, కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 
Nikhil
Marriage
Pallavi

More Telugu News