Allu Arjun: 'పుష్ప' సినిమాలో ఫోక్ సాంగ్స్!

Pushpa Movie
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • డాన్సులు .. ఫైట్ల పై ప్రత్యేక శ్రద్ధ
  • లాక్ డౌన్ తరువాత షూటింగు మొదలు
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందనుంది. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అడవి నేపథ్యంలో .. కలప అక్రమరవాణా ప్రధానంగా ఈ కథ నడవనుంది. అడవి పరిసర ప్రాంతాల్లోని గిరిజన గూడాలను కలుపుకుంటూ ఈ కథ సాగనుంది. అందువలన ఈ సినిమాలో జానపదగీతాల శాతం ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు.

గూడెం ప్రజలు .. నాయకా నాయికల మధ్య చోటుచేసుకునే ఈ జానపద గీతాలు హుషారెత్తిస్తాయని చెబుతున్నారు. బన్నీ క్రేజ్ ను .. ఆయన నుంచి అభిమానులు ఆశించే స్టెప్స్ ను దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీ  ప్రసాద్ ట్యూన్స్ కడుతున్నాడని అంటున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషలతో పాటు, హిందీలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని కూడా దృష్టిలో పెట్టుకుని, డాన్స్ .. ఫైట్స్ విషయంలో సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa

More Telugu News