TTD: జర్నలిస్టునని చెప్పి తిరుమలకు మాంసం, మద్యం తీసుకెళ్తున్న వ్యక్తి అరెస్టు

man arrests in tirumala
  • వాహనంలోని సీట్‌ కింది భాగంలో మద్యం, మాంసం ఉంచి రవాణా
  • పోలీసుల కళ్లుగప్పి తీసుకెళ్లే యత్నం
  • అనుమానం వచ్చి సోదాలు చేసిన పోలీసులు
గతంలో జర్నలిస్టుగా పనిచేశాడు.. ఇప్పటికీ మీడియాలోనే పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఓ వాహనంలోని సీట్‌ కింది భాగంలో మద్యం, మాంసం ఉంచి తిరుపతి నుంచి తిరుమలకు వాటిని అక్రమంగా తరలిస్తున్నాడు. చివరకు అతడిపై పోలీసులకు అనుమానం రావడంతో సోదాలు నిర్వహించగా అతడు మద్యం, మాంసం తరలిస్తున్నాడని నిర్ధారణ అయింది.

దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి పేరు వెంకటముని అని అలిపిరి విజిలెన్స్‌ అధికారులు చెప్పారు. తిరుమలలో గతంలో అతడు మీడియాలో పనిచేశాడని గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికీ మీడియా పేరును ఉపయోగిస్తూ పోలీసుల సోదాలకు చిక్కకుండా ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
TTD
Tirumala
Tirupati

More Telugu News