అల్లు అర్జున్ 'బుట్టబొమ్మ' పాటకు స్టెప్పులేసిన కెవిన్ పీటర్సన్.. వీడియో వైరల్
- బన్నీ అభిమానులను అలరిస్తోన్న డ్యాన్స్
- వెరైటీగా స్టెప్పులు
- నా డ్యాన్స్ మరింత మెరుగుపడుతుందా? అంటూ ట్వీట్
బుట్టబొమ్మ పాటకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ డ్యాన్స్ చేశారు. కొన్ని రోజుల నుంచి ఆయన టిక్ టాక్‌లో చాలా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి. బుట్టబొమ్మ సాంగ్‌కి వెరైటీగా స్టెప్పులేసి ఆయన అల్లు అర్జున్ అభిమానులను అలరించారు. అంతేకాదు, 'నా డ్యాన్స్ మరింత మెరుగుపడుతుందా?' అంటూ ఆయన అభిమానులను అడిగారు. ఆయన డ్యాన్స్ అద్భుతం అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.