మోడల్ రెడీ... ఇలా మారిపోనున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు!
- 36 సీట్ల స్థానంలో 26 సీట్లు
- మధ్యలో సీటు ఏర్పాటు
- అధికారులు అనుమతిస్తే, అన్నీ ఇలానే
ప్రయాణికుల మధ్య దూరం తప్పనిసరిగా ఉండాల్సిన నేపథ్యంలో మొత్తం 36 సీట్లలో 10 సీట్లను తగ్గించి, 26 సీట్లకు కుదించారు. ప్రయాణికులు నడిచే దారిలో 8 సీట్లను అమర్చారు. అటూ, ఇటూ రెండు రెండు సీట్లుండే చోట ఒక్క సీటునే ఏర్పాటు చేశారు. ఈ మోడల్ ను అధికారులు ఓకే చేస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇలాగే మార్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.