Pawan Kalyan: ప్రధాని ప్రకటించిన ఉద్దీపన చారిత్రాత్మకం: పవన్ కల్యాణ్

Pawan Kalyan opines on PM Modi speech towards nation
  • జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
  • ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్
  • 21వ శతాబ్దం మనదేనంటూ ఉద్ఘాటన
లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. "మీరు అభిలషిస్తున్న 'స్వయం ఆధారిత భారత్' దేశానికి ఎంతో మేలు చేస్తుంది. దేశాభివృద్ధితో పాటు తక్కిన ప్రపంచానికి దిక్సూచిలా వ్యవహరించేందుకు తోడ్పాటునందిస్తుంది. మీరు ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ఓ చారిత్రాత్మక సంస్కరణ అవుతుంది. అది ఇవాళ్టి నుంచే ప్రారంభం కావాలి. 21వ శతాబ్దం భారత్ దే. ఇది నవ భారత్ ఆవిర్భావానికి నాంది" అంటూ ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Narendra Modi
Stimulus
Lockdown
India

More Telugu News