Nani: ఈ 2020లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో: రానాపై నాని వ్యాఖ్యలు

Nani wishes Rana on his big revelation

  • ప్రియురాలిని పరిచయం చేసిన రానా
  • తన ప్రపోజల్ కు ఆమె యస్ అని చెప్పిందంటూ వెల్లడి
  • సూపర్ హ్యాపీ బాబాయ్ అంటూ స్పందించిన నాని

టాలీవుడ్ అగ్రనటుడు రానా దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడు. తన ప్రేయసి మిహీక బజాజ్ తన ప్రపోజల్ కు ఓకే చెప్పిందని రానా స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై రానా మిత్రబృందం స్పందిస్తోంది. నేచురల్ స్టార్ నాని ఈ అంశంపై వ్యాఖ్యానిస్తూ, ఈ 2020 సంవత్సరంలో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందోనంటూ చమత్కరించాడు.

 'జోక్స్ సంగతి అటుంచితే, సూపర్ హ్యాపీగా ఉంది బాబాయ్' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, 'హమారా బజాజ్' అంటూ సాగే పాత వాణిజ్య ప్రకటన తాలూకు వీడియోను కూడా అంకితం ఇస్తున్నట్టు తెలిపాడు. రానా పెళ్లాడబోతున్న అమ్మాయి ఇంటిపేరు 'బజాజ్' (మిహీక బజాజ్) కావడమే నాని ఈ వీడియోను పంచుకోవడానికి కారణం అని తెలుస్తోంది.

Nani
Rana
Miheeka Bajaj
Proposal
Tollywood
  • Loading...

More Telugu News