Miheeka Bajaj: చిరంజీవికి ధన్యవాదాలు తెలిపిన రానాకి కాబోయే భార్య

Rana fiance Miheeka Bajaj responds on Chiranjeevi wishes
  • తన ప్రేయసి ఓకే చెప్పిందంటూ రానా ట్వీట్
  • టాలీవుడ్ లో మొదలైన సందడి
  • శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
  • శతమానం భవతి అంటూ దీవెనలు
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రానా-మిహీక గురించే చర్చించుకుంటున్నారు. తన ప్రతిపాదనకు మిహీక ఓకే చెప్పిందంటూ రానా వెల్లడించడంతో సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'శతమానం భవతి' అంటూ దీవించారు. దీనిపై మిహీక బజాజ్ వెంటనే ట్వీట్ చేసింది. 'థాంక్యూ చిరంజీవి సర్' అంటూ వినమ్రంగా స్పందించింది. కాగా, రానా శుభవార్త చెప్పడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్, నితిన్, నిధి అగర్వాల్, నీల్ నితిన్ ముఖేశ్, కుబ్రా సైత్ వంటి సెలబ్రిటీలు విషెస్ తెలిపారు.
Miheeka Bajaj
Chiranjeevi
Rana
Tollywood

More Telugu News