Allu Arjun: ఈసారి చంపేశారు సార్: వార్నర్ డ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫిదా

Allu Arjun responds on David Warner dancing video
  • బన్నీ పాటకు డ్యాన్స్ చేసిన వార్నర్
  • కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్
  • టాలీవుడ్ హిట్ సాంగ్స్ కు టిక్ టాక్ వీడియోలు చేస్తున్న వార్నర్
ఆసీస్ డాషింగ్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నాడు. అయితే ఈ ఖాళీ సమయంలో అల్లు అర్జున్ నటించిన అల... వైకుంఠపురములో చిత్రం సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఇటీవలే బుట్టబొమ్మా సాంగ్ కు టిక్ టాక్ వీడియో చేసిన వార్నర్ తాజాగా రాములో రాములా పాటకు డ్యాన్స్ చేశాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. "మరో పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు సర్. ఈసారి చంపేశారు. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.
Allu Arjun
David Warner
Ramulo Ramula
TikTok
Tollywood

More Telugu News