Chandrababu: ఏపీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని తరలించేందుకు చూస్తున్నారు: చంద్రబాబు ఆరోపణలు
- తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం
- ఈ నెల 28 నుంచి విశాఖకు తరలించాలని చూస్తున్నారు
- న్యాయస్థానాల్లో ఒకటి చెబుతూ మరోటి చేస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28 నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో ఒకటి చెబుతూ మరోటి చేస్తోందంటూ ఏపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ క్యాంపు కార్యాలయాన్ని తరలించాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయొద్దని న్యాయస్థానం ఆదేశించినా మళ్లీ అదే పని చేస్తోందంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.