Rana Daggubati: మిహీకాను పెళ్లిచేసుకోబోతున్నా: రానా సంచలన ప్రకటన

Rana Daggubati Announces His Engagement with Miheeka Bajaj
  • తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేసిన రానా
  • ఆమె ఓకే చెప్పిందంటూ వ్యాఖ్య
  • రానాకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
సినీ హీరో రానా దగ్గుబాటి సంచలన ప్రకటన చేశాడు. మిహీకా బజాజ్ ను త్వరలోనే పెళ్లాడబోతున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అంతే కాదు తన ప్రియురాలు మిహీకాతో కలిసి ఆనందంగా ఉన్న ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. 'ఆమె ఓకే చెప్పింది' అంటూ కామెంట్ పెట్టాడు. ఫొటోలో రానా క్యాజువల్ కాటన్ షర్ట్ లో ఉండగా... మిహీకా గ్రీన్ కలర్ షర్ట్ లో చూడముచ్చటగా ఉంది. మరోవైపు పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించిన రానాకు... సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మిహీకా ముంబైలో 'డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో' అనే సంస్థను నెలకొల్పి ఈవెంట్ ప్లానెర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.  
Rana Daggubati
Miheeka Bajaj
Love
Marriage
Bollywood
Tollywood

More Telugu News