కోమాలో ఉన్న మాజీ సీఎంకు ఆడియో థెరపీ... ఇష్టమైన పాటలు వినిపిస్తున్న వైద్యులు
- మే 9న అస్వస్థతకు గురైన అజిత్ జోగి
- ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిన మాజీ సీఎం
ఇంతకీ అజిత్ జోగి అస్వస్థతకు ఓ చింతపిక్క కారణమని వైద్యులు చెబుతున్నారు. చింతపిక్క ఆయన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వివరించారు. అజిత్ జోగి మెదడును క్రియాశీలకంగా మార్చేందుకు ఆడియో థెరపీ ఇస్తున్నామని శ్రీ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఖేమ్కా వెల్లడించారు. ఆయనకు ఇష్టమైన పాటలను ఇయర్ ఫోన్స్ ద్వారా వినిపిస్తున్నామని, అయితే ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని తెలిపారు.