'వెబ్ సిరీస్' కోసం పర్మిషన్ అడిగిన అల్లు అరవింద్?
- ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'ను ప్రారంభించిన అల్లు అరవింద్
- మినీ వెబ్ సిరీస్ నిర్మించాలనుకుంటున్న వైనం
- యూనిట్ కు పర్మిషన్ ఇవ్వాలని కోరిన అరవింద్
ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'ను అల్లు అరవింద్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కోసం ఓ మినీ వెబ్ సిరీస్ ను నిర్మించాలనుకుంటున్నారు. దీని కోసం 15 నుంచి 20 మంది సభ్యులున్న యూనిట్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. కరోనా ఎఫెక్ట్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.