విజయ్ హీరోగా లారెన్స్ మూవీ
- గతంలో లారెన్స్ నుంచి వచ్చిన మాస్ కథలు
- హారర్ కామెడీ జోనర్ నుంచి ఎక్కువ సక్సెస్ లు
- వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి
ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలెక్కడం ఖాయమైపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 'మాస్టర్' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత లారెన్స్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. లారెన్స్ మాస్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే కథలను తయారు చేసుకుంటాడు. ఇక విజయ్ కి కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమా, పక్కా మాస్ కంటెంట్ తోనే వుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.