Jagan: సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాలని మోదీని కోరిన జగన్

PM Modi Video conference with All states CMs
  • రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ  వీడియో కాన్ఫరెన్స్
  • ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
  • ‘కరోనా’ను నియంత్రించగలిగామని మోదీకి చెప్పిన జగన్
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ  ఐదోసారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. కేంద్రం సూచనలకు అనుగుణంగా రెండు నెలల నుంచి చర్యలు తీసుకున్నామని, ‘కరోనా’ను నియంత్రించగలిగామని మోదీకి చెప్పినట్టు సమాచారం.

ఏపీలో మూడు సార్లు సమగ్ర సర్వే నిర్వహించామని, 30 వేల మందిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించామని చెప్పినట్టు సమాచారం. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాలని, ‘కరోనా’ను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమని జగన్ చెప్పినట్టు సమాచారం.

‘కరోనా’ లక్షణాలు ఉన్న వ్యక్తులను సమాజం వేరుగా చూస్తోందన్న భావన వస్తోందని, అందుకే, ఈ లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదన్న విషయాన్ని మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లినట్టు సమాచారం.
Jagan
YSRCP
Andhra Pradesh
cm
Narendra Modi
PM

More Telugu News