Brahmaji: 'బాగా దగ్గరగా బతికిన, అతికిన రోజుల్లో' అంటూ సినీ నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర ఫొటోలు!

Actor Brahmaji shares old pics with Raviteja and Pawan Kalyan
  • కరోనా కారణంగా ఎవరింటికి వారే పరిమితం
  • జనాలు ఒకరినొకరు కలవలేని పరిస్థితి
  • అందరూ కలిసున్న పాత ఫొటోలను షేర్ చేసిన బ్రహ్మాజీ
కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఎంతో అనుబంధం, స్నేహం ఉన్న వ్యక్తికి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇక పక్కన కూర్చొని మాట్లాడటం, కలిసి భోజనాలు చేయడం... ఇలాంటివన్నీ పూర్తిగా బంద్ అయ్యాయి. ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకవేళ బయటకు వచ్చినా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అయిపోయింది. ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

ఈనేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో సినీ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా కామెడీగా వెల్లడించాడు. 'ఒకప్పుడు బాగా దగ్గరగా బతికిన రోజుల్లో', 'బాగా అతికిన రోజుల్లో' అంటూ ఫొటోలు షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో రవితేజ, సుబ్బరాజు, డైరెక్టర్లు హరీశ్ శంకర్, మెహర్ రమేశ్, బీవీఎస్ రవిలతో కలసి పార్టీ చేసుకున్న ఫొటో... 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయితేజ్, అలీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు.
Brahmaji
Tollywood
Lockdown
Raviteja
Pawan Kalyan
Ramcharan
Sai Dharam Tej

More Telugu News