Corona Virus: భారత్‌లో తీవ్రతరమైన కరోనా.. 24 గంటల్లో 4,213 మందికి సోకిన వైనం

Total cases in the country now at 67152 including 44029 active cases
  • గత 24 గంటల్లో భారత్‌లో 97 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 2,206
  • మొత్తం కేసులు 67,152
  • ఆసుపత్రుల్లో 44,029 మందికి చికిత్స  
భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఏ రోజూ నమోదుకానన్ని అత్యధిక కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 4,213 మందికి కొత్తగా కరోనా సోకింది.

గత 24 గంటల్లో భారత్‌లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,206కి చేరింది.  దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 67,152కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,917  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 44,029 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
COVID-19
India

More Telugu News