Mumbai Police: స్నేహితుడితో చక్కర్లు కొడుతూ పోలీసులకు పట్టుబడిన నటి పూనమ్ పాండే!

Case Registered on Poonam Pandey for Violating Lockdown
  • రాత్రి 8 గంటల సమయంలో వీధుల్లోకి
  • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు
  • వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, తన స్నేహితుడితో కలిసి రోడ్లపై చక్కర్లు కొడుతున్న బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో బీఎండబ్ల్యూ కారులో సినీ దర్శకుడు, తన మిత్రుడు అహ్మద్ బాంబేతో కలిసి పూనమ్ బయలుదేరింది.

వీరి కారును ఆపిన మెరైన్ డ్రైవ్ ప్రాంత పోలీసులు, బయటకు వచ్చిన కారణాన్ని అడుగగా, సరైన సమాధానం చెప్పక పోవడంతో, ఇద్దరినీ అరెస్ట్ చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని వదిలేశామని జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశందర్ స్పష్టం చేశారు. ఇద్దరిపైనా ఐపీసీ సెక్షన్ 188, 269 కింద కేసు నమోదైందని అన్నారు.
Mumbai Police
Poonam Pandey
Case
Lockdown

More Telugu News