Nara Lokesh: ‘జగన్ మార్క్ దోపిడీ..’ అంటూ నారా లోకేశ్ విమర్శలు

Nara Lokesh criticises CM Jagan
  • బాదుడే... బాదుడు ..
  • విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారు
  • వైసీపీ నాయకులు దరువు వెయ్యడమే ఆలస్యం
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారాలోకేశ్ మరోమారు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పేరిట కొత్త దోపిడీ ప్రారంభమైందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారంటూ సెటైర్లు విసిరారు. ‘బాదుడే... బాదుడు.. జగన్ మార్క్ దోపిడీ’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశాడు.

ఈ దోపిడీకి వైసీపీ నాయకులు దరువు వెయ్యడమే ఆలస్యమని విమర్శించారు. ఇందుకు సంబంధించి విద్యుత్ బిల్లు రీడింగ్ తీసుకుంటున్న ఓ ఎంప్లాయి వీడియోను జతపరిచారు. సదరు ఉద్యోగి, వినియోగదారుడి సంభాషణ ఈ వీడియోలో కనబడుతుంది.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
cm

More Telugu News