Telangana: తెలంగాణలో ఇవాళ కొత్తగా 33 కరోనా కేసులు

Thirty Three new cases confirmed corona positive in Telangana today
  • జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 మందికి కరోనా
  • మరో ఏడుగురు వలస కార్మికులకు కరోనా నిర్ధారణ
  • మొత్తం కేసుల సంఖ్య 1196
తెలంగాణలో కరోనా ఉద్ధృతి క్రమంగా ఊపందుకుంటోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కొన్నిరోజుల పాటు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడంతో కట్టడి చర్యలు ఫలితాలనిస్తున్నాయని భావించారు. అయితే, గత కొన్నిరోజులుగా నిత్యం పెద్ద సంఖ్యలో కేసులు నమోదువుతుండడం, అది కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికులకు కరోనా నిర్ధారణ అవుతుండడం అధికార వర్గాలను కాస్తంత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇవాళ తెలంగాణలో 33 కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు. ఏడుగురు వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ఇక, తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కి పెరిగింది. ఇవాళ ఎవరూ డిశ్చార్చి కాలేదు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాతో 30 మంది మరణించారు.
Telangana
Corona Virus
Positive Cases
Deaths
COVID-19

More Telugu News