Police: మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కలకలం... 714 మందికి పాజిటివ్

Maharashtra police suffers with corona
  • మహారాష్ట్రలో కరోనా బీభత్సం
  • ఐదుగురు పోలీసుల మృతి
  • 55 ఏళ్లకు పైబడిన పోలీసులను ఇంటివద్దనే ఉండాలన్న అధికారులు
భారత్ లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 19,063 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 731 మంది ప్రాణాలు విడిచారు. మహారాష్ట్ర పోలీసు విభాగంలోనూ కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు 714 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు గుర్తించారు.

వారిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ముంబయిలో 55 ఏళ్లకు పైబడిన పోలీసులను ఇంటి వద్దనే ఉండాలని అధికారులు సూచించారు. ఒక్క ముంబయిలోనే 11 వేలకు పైగా కేసులు నమోదవడం ఇక్కడి దారుణ పరిస్థితులకు నిదర్శనం.

కాగా ,లాక్ డౌన్ అమల్లోకి వచ్చాక పోలీసులపై దాడులు కూడా జరిగాయి. వివిధ సందర్భాల్లో పోలీసులపై 194 దాడి ఘటనలు జరిగాయని, దాడులకు పాల్పడిన 689 మందిని అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు.
Police
Maharashtra
Corona Virus
Positive Cases

More Telugu News