Nara Lokesh: టీవీ5 ఆఫీసుపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను: వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్

lokesh on attack on tv5
  • టీవీ5 కార్యాలయంపై రాళ్ల దాడి పిరికిపంద చర్య
  • ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు
  • మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి
  • లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికీ వచ్చే ప్రమాదం ఉంది 
హైదరాబాద్‌లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'హైదరాబాద్‌లోని టీవీ 5 కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. టీవీ5 కార్యాలయంపై రాళ్ల దాడి పిరికిపంద చర్య. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి' అని అన్నారు.

'పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా జరుగుతున్న సంఘటనలపై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికీ వచ్చే ప్రమాదం ఉంది' అని లోకేశ్ పేర్కొన్నారు.

'అన్ని రాజకీయ పార్టీలు మీడియా, మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడటానికి ముందుకు రావాలి. వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను' అని ఆయన ట్వీట్లు చేశారు.
Nara Lokesh
Telugudesam
Telangana
Andhra Pradesh
Hyderabad

More Telugu News