Kim Jong Un: నిన్న చైనా అధ్యక్షుడికి.. నేడు ర‌ష్యా అధ్య‌క్షుడికి ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మెసేజ్

Kim Jongun sends Putin letter in outreach amid coronavirus crisis
  • రెండో ప్ర‌పంచ యుద్ధంలో మిత్ర‌రాజ్యాల విజ‌యానికి గుర్తుగా వార్షికోత్స‌వం
  • రష్యాకు కిమ్ శుభాకాంక్ష‌లు
  • ఇప్పుడు క‌రోనా వైర‌స్‌పై ర‌ష్యా విజ‌యం సాధించాలని ఆకాంక్ష
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ఉత్తర కొరియా అధ్యక్షుడు‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవల ప్రశంసల జల్లు కురిపిస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే. కరోనాపై పోరాటంలో విజయం సాధించినందుకు జిన్‌పింగ్‌కు కిమ్‌ అభినందనలు తెలిపారని ఉత్తరకొరియా మీడియా పేర్కొంది. తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కిమ్‌ జోంగ్ ఉన్ లేఖ రాశారు.

రెండో ప్ర‌పంచ యుద్ధంలో మిత్ర‌రాజ్యాల విజ‌యానికి గుర్తుగా 75వ వార్షికోత్స‌వం జరుపుకుంటున్న సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇప్పుడు క‌రోనా వైర‌స్‌పై ర‌ష్యా విజ‌యం సాధించాల‌ని కిమ్‌ ఆకాంక్షించారు. వైరస్‌పై విజ‌యం సాధించి శ‌క్తిమంత‌మైన ర‌ష్యాను నిర్మించ‌డానికి అక్క‌డి ప్ర‌జ‌లు చేస్తున్న యుద్ధంలో గెలవాలని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.
Kim Jong Un
Corona Virus
China
Russia

More Telugu News