ఈ నెల 15 నుంచి వందేభారత్ మిషన్ రెండో దశ ప్రారంభం!
- మే 7 నుంచి తొలి దశ అమలు
- విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు ప్రారంభం
- రెండో విడతలో మరికొన్ని దేశాల నుంచి తరలింపు
రెండో విడతలో భాగంగా రష్యా, ఉక్రెయిన్, కజకిస్థాన్, థాయిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాల్లోని భారతీయులను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన దేశాల్లోని వారిని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రెండో విడత తరలింపు కోసం ఇప్పటివరకు ఎంబసీల వద్ద 67,833 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 22,470 విద్యార్థులు, 15,815 మంది వలస కార్మికులు ఉన్నారని కేంద్రం వెల్లడించింది.