Andhra Pradesh: గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం కోసం రూ.30 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

 AP Government sanctioned thirty crore rupees for Vizag gas leak victims
  • వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృత్యువాత
  • మృతులకు రూ.1 కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
  • చికిత్స పొందుతున్న వారికీ భారీగా పరిహారం
వైజాగ్ లో నిన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ఘటనలో 12 మంది మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. మృతులు ఒక్కొక్కరికి సీఎం జగన్ రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతేకాదు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి, మూగజీవాల యజమానులకు కూడా భారీగా పరిహారం ప్రకటించారు. తాజాగా, దీనికి సంబంధించిన రూ.30 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోటి రూపాయల పరిహారాన్ని మృతుల కుటుంబసభ్యులకు అందజేస్తారు.
Andhra Pradesh
Vizag Gas Leak
Vizag
LG Polymers
ExGratia

More Telugu News