అల్లు అరవింద్ .. కరణ్ జొహార్ నిర్మాణంలో ప్రభాస్
- ప్రభాస్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
- నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ చిత్రం
- మరో బహుభాషా చిత్రంలో ప్రభాస్
ఆ తరువాత ప్రభాస్ చేయనున్న సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తో కూడినదే అనే టాక్ వినిపిస్తోంది. అల్లు అరవింద్ - కరణ్ జొహార్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. కథా వస్తువు ఏమిటి? దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.