America: అవును.. ఆ వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చింది: అమెరికా విదేశాంగ మంత్రి

Corona virus came from Wuhan Lab
  • ఆ ఆధారాలను తాను చూశానన్న పాంపియో
  • పెర్ల్ హార్బర్ దాడి కంటే ఎక్కువ నష్టమన్న ట్రంప్
  • పాంపియో కట్టుకథలు చెబుతున్నారన్న చైనా
చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టిందని తొలి నుంచీ ఆరోపిస్తున్న అమెరికా తాజాగా, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. ఆధారాలను తాను స్వయంగా చూసినట్టు చెప్పారు. వుహాన్ నుంచే వైరస్ బయటకొచ్చిందని గతేడాది డిసెంబరులోనే చైనాకు తెలిసినా  వారు వేగంగా స్పందించలేదని ఆయన ఆరోపించారు.

రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికాలోని పెర్ల్ హార్బర్‌పై జపాన్ జరిపిన దాడిలో జరిగిన నష్టం కంటే కరోనా వైరస్  కారణంగా అమెరికాకు ఎక్కువ నష్టం వాటిల్లినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా, అమెరికా ఆరోపణలపై చైనా తీవ్రంగా స్పందించింది. వుహాన్ ల్యాబ్‌ను ఫ్రాన్స్ భాగస్వామ్యంతో నిర్మించినట్టు పేర్కొన్న చైనా.. ఈ విషయం పాంపియోకు తెలిసినట్టు లేదని, అందుకే కట్టుకథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా శత్రువు కరోనా వైరస్సే కానీ చైనా కాబోదని స్పష్టం చేసింది. కోవిడ్‌పై పోరులో తమతో కలిసి రావాలని  ఐక్యరాజ్య సమితిలో చైనా దౌత్యవేత్త చెన్‌ షూ అమెరికాకు పిలుపునిచ్చారు.
America
mike pompeo
china
Wuhan
Corona Virus

More Telugu News