కర్ణాటకలో పోటెత్తుతున్న మందుబాబులు... రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
- దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై ఆంక్షల తొలగింపు
- కర్ణాటకలో తొలి రెండ్రోజుల్లో రూ.242 కోట్ల ఆదాయం
- ఇవాళ ఒక్కరోజే రూ.165 కోట్లు
నేడు కర్ణాటక మొత్తమ్మీద రూ.165 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తొలి రెండు రోజుల్లోనే కర్ణాటకలో రూ.242 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయంటే మందుబాబుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం విక్రయాలు ప్రారంభమైన రోజే కర్ణాటకలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. బెంగళూరులోని కొన్ని వైన్ షాపుల వద్ద యువతులు కూడా క్యూలైన్లలో దర్శనమిచ్చారు.