Telangana: తెలంగాణలో రైతు రుణమాఫీకి ఏక మొత్తంగా రూ. 1200 కోట్ల విడుదల

Rs 1200 cr released in Telangana for Runa Mafi
  • రూ. 25 వేల లోపు రుణం ఉన్నవారికి నిధుల విడుదల
  • అంతకుపైన రూ. లక్ష లోపు ఉన్నవారికి నాలుగు విడతల్లో చెల్లింపులు
  • రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధుల విడుదల
రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ. 25 వేల లోపు రైతురుణాల మాఫీ కోసం ఏక మొత్తంలో రూ. 1,200 కోట్లు విడుదలయ్యాయి. 6 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రూ. 25 వేల లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బును జమ చేయాలని మంత్రులు చెప్పారు. రూ. 25 వేల కన్నా ఎక్కువ, రు. లక్ష లోపు ఉన్న వారికి నాలుగు విడతల్లో రుణ చెల్లింపులు జరపాలని తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, వానాకాలం పంటకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధులను కూడా విడుదల చేసినట్టు చెప్పారు.
Telangana
Raithu Bandhu
Raithu Runa Mafi
TRS
KCR
Harish Rao

More Telugu News