విశాఖ ఘటనపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: ఏపీ మంత్రి మేకపాటి
- యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలకు ఆదేశించాం
- పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలిస్తున్నాం
- హెల్ప్ లైన్ నెంబర్లు 7997952301, 8919239341 ఏర్పాటు చేశాం
ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం నిమిత్తం డిప్యూటీ డైరెక్టర్ ఎస్. ప్రసాదరావును సంప్రదించాలని సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్లు 7997952301, 8919239341 ఏర్పాటు చేశామని తెలిపారు. మరో అధికారి ఆర్ బ్రహ్మ కూడా 9701197069 నెంబరులో అందుబాటులో ఉంటారని తెలిపారు.