Pawan Kalyan: బండారు దత్తాత్రేయతో ఈ రోజు ఫోన్లో ముచ్చటించడం ఎంతో ఆనందాన్నిచ్చింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan says he talked with Bandaru Dattatreya in nice way
  • దత్తాత్రేయకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్
  • తరచుగా ఫోన్లో సంభాషిస్తుంటారని వెల్లడి
  • ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్న పవన్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో ఈ రోజు ఫోన్లో ముచ్చటించడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు. ఆయనకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. తరచుగా ఫోన్లో సంభాషించే దత్తాత్రేయ ప్రజా సంబంధమైన అనేక విషయాలు మాట్లాడుతుంటారని, ఆయన మాటలు, ప్రజా జీవిత అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని పవన్ వివరించారు.

"హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎంతో మృదుస్వభావి. ఆయనతో నేడు జరిగిన టెలిఫోన్ సంభాషణ ఆసాంతం ఆప్యాయంగా సాగింది. విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజి దుర్ఘటనలో పలువురు మృతి చెందడం, పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలవడం కలచివేసిందన్నారు. అంతేగాకుండా, కరోనా ప్రభావం, లాక్ డౌన్ పరిస్థితులపైనా మేం చర్చించుకున్నాం" అని పవన్ వెల్లడించారు.
Pawan Kalyan
Bandaru Dattatreya
Himachal Pradesh
Governor
Vizag Gas Leak
Corona Virus
Lockdown

More Telugu News