RGV: ఎలాంటి వివక్ష లేకుండా మనుషుల్ని చంపేది ఈ మూడే!: గ్యాస్ లీక్‌పై రామ్ గోపాల్ వర్మ విచారం

RGV Since film industry is shut God is busy making real life thriller movies
  • మొదట కరోనా.. ఇప్పుడు గ్యాస్.. మనుషులపై దాడి చేశాయి
  • ఇక దాడి చేయడానికి ఏలియన్స్‌ మాత్రమే మిగిలున్నాయి
  • దేవుడు రియల్ లైఫ్ థ్రిల్లర్ సినిమాలు చూపిస్తున్నాడు
విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారం వ్యక్తం చేశారు. 'మొదట కరోనా.. ఇప్పుడు గ్యాస్.. మనుషులపై దాడి చేశాయి. ఇక మనుషులపై దాడి చేయడానికి ఏలియన్స్‌ మాత్రమే మిగిలి ఉన్నాయని అనిపిస్తోంది' అని బాధను వ్యక్తం చేస్తున్నట్లు ఎమోజీలు పోస్ట్ చేశారు.

'సినీ పరిశ్రమ మూసేసినప్పటి నుంచి, రియల్ లైఫ్ థ్రిల్లర్ సినిమాలు చూపిస్తూ దేవుడు చాలా బిజీగా ఉన్నాడు. ఎటువంటి మత, కుల, జాతి వివక్ష లేకుండా మనుషుల్ని చంపేది ఈ మూడే.. ఉగ్రవాదులు, వైరస్, దేవుడు' అని వర్మ ట్వీట్లు చేశారు. కాగా, విశాఖపట్నం ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
RGV
Tollywood
Vizag Gas Leak

More Telugu News