Vizag Gas Leak: విశాఖపట్నం దుర్ఘటనలో మృతుల వివరాలు ఇవిగో!

vizag gas leakage tragedy
  • కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19) మృతి
  • గంగాధర్, నారాయణమ్మ, నరసమ్మ, గంగరాజు, కృష్ణ మూర్తి మృతి
  • మృతుడు చంద్రమౌళి ఏఎంసీలో ఎంబీబీఎస్‌ విద్యార్థి 

విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య  9కి చేరిందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణమూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు చంద్రమౌళి విశాఖపట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్‌ తొలి ఏడాది చదువుతున్నాడు. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో వుండడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏపీ సీఎం జగన్ పర్యటన అనంతరం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News